Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలికకు మత్తు మందిచ్చి రెండు గంటలపాటు అరాచకం!

  • బాలికను అపహరించి మత్తుమందిచ్చిన నిందితులు
  • ఆపై రెండు గంటలపాటు అత్యాచారం
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
ఉత్తరప్రదేశ్‌లో దారుణాలకు అంతూపొంతు లేకుండా పోతోంది. ఓ బాలికను అపహరించుకెళ్లిన కొందరు యువకులు ఆమెకు మత్తు మందిచ్చి రెండు గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. మొరాదాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనపై అత్యాచారానికి పాల్పడింది తమ ఊరి వారేనని బాధిత బాలిక పోలీసులకు తెలిపింది.

రెండు గంటలకు పైగా వారు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. అత్యాచారం అనంతరం దుండగులు స్పృహ కోల్పోయిన బాలికను అక్కడే వదిలేసి పరారయ్యారు. బాలిక కనిపించడం లేదని వెతుకుతున్న కుటుంబ సభ్యులకు ఆమె స్పృహ కోల్పోయిన స్థితిలో కనిపించింది.

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ ఉదయ్ సింగ్ తెలిపారు. ఘటనకు ముందే బాలికకు నిందితులు తెలుసని పేర్కొన్నారు. నిందితుల్లో  ఏ ఒక్కరినీ వదలబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. 
Uttar Pradesh
Rape
Moradabad
Minor Girl
POCSO

More Telugu News