Narayana: దాడులకు వచ్చిన మాట నిజమే... ఇప్పుడు లేరు: ఏపీ మంత్రి నారాయణ

  • నా ఇల్లు, కాలేజీలపై దాడులు జరగడం లేదు
  • ఐటీ దాడులంటూ పుకార్లు
  • మీడియా సంయమనం పాటించాలన్న నారాయణ
నెల్లూరులోని తన ఇల్లు సహా, రాష్ట్రంలోని నారాయణా విద్యా సంస్థల్లో ఎటువంటి ఐటీ దాడులూ జరగడం లేదని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తమ కాలేజీలకు ఐటీ అధికారులు వచ్చిన మాట నిజమేనని, తిరిగి వారు వెళ్లిపోయారని ఆయన స్పష్టం చేశారు.

 ఈ ఉదయం అమరావతిలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐటీ దాడులపై పుకార్లు చెలరేగుతున్నాయని, కేవలం ఒకటి, రెండు చోట్ల దాడులు జరుగుతున్నాయని తెలుస్తోందని, దీనిపై స్పష్టత రావాల్సి వుందని, మీడియా సంయమనం పాటించాలని అన్నారు. కాగా, విజయవాడ, బెంజ్ సర్కిల్ లో ఉన్న నారాయణ కాలేజీకి ఈ ఉదయం దాడులకు వచ్చిన ఐటీ అధికారులు, కాసేపుండి వెళ్లిపోయినట్టు సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలువురు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో మాత్రం రైడ్స్ జరుగుతున్నాయి.
Narayana
Andhra Pradesh
IT Raids

More Telugu News