vijay devarakonda: తమిళంలో 'నోటా'కి పోటీ మాములుగా లేదు!

  • తమిళంలో నేడు '96' మూవీ రిలీజ్ 
  • రేపు భారీస్థాయిలో 'రాక్షసన్' విడుదల 
  • విడుదలకి ముందే మంచి టాక్  

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు .. తమిళ భాషల్లో 'నోటా' రూపొందింది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను రేపు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ను బట్టి చూసుకుంటే, ఈ సినిమాకి పెద్దగా పోటీ కనిపించడం లేదు. కానీ తమిళంలో మాత్రం గట్టి పోటీనే కనిపిస్తోంది.

విజయ్ సేతుపతి - త్రిష జంటగా రూపొందిన '96' మూవీ ఈ రోజునే అక్కడ విడుదలైంది. ప్రివ్యూలతోనే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చేసింది. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ తమిళ సినిమాల్లో ఇదొకటి అనే ప్రచారం జరుగుతోంది. ఇక 'రాక్షసన్' తమిళ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ లో ఇది ఒకటి అంటున్నారు. ఈ రెండు సినిమాలు విడుదలకి ముందే మంచి టాక్ తెచ్చుకోవడంతో, అక్కడ 'నోటా'కి గట్టిపోటీనే ఎదురుకానుందని అర్థమవుతోంది.  

More Telugu News