Trains: ప్రయాణికులకు భారతీయ రైల్వే గట్టి షాక్‌.. ఒకే రోజు 149 రైళ్ల రద్దు!

  • ప్రత్యేక కారణాలను వెల్లడించని శాఖ
  • రద్దయినవన్నీ పాసింజరు, మెయిల్‌ రైళ్ళే
  • రాంపూర్‌-షెల్డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా రద్దు

భారతీయ రైల్వే అధికారులు ప్రయాణికులకు గురువారం గట్టి షాక్‌ ఇచ్చారు. ప్రత్యేక కారణాలేమీ తెలియజేయకుండానే భారీ సంఖ్యలో (మొత్తం 149) రైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. తుపాన్‌లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు, శాంతిభద్రత సమస్యలు తలెత్తినప్పుడు రైల్వే శాఖ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సర్వసాధారణం.

అయితే ఈసారి రైళ్ల రద్దుకు ఆ శాఖ ఎటువంటి ప్రత్యేక కారణాన్ని వెల్లడించలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల రైళ్లను రద్దు చేస్తున్నట్లు మాత్రమే ప్రకటించింది. రద్దయిన రైళ్లలో అత్యధికం పాసింజర్‌ ట్రైన్‌లు కాగా, మిగిలినవి మెయిల్‌ రైళ్లు. వీటితోపాటు రాంపూర్‌-షెల్డాల మధ్య తిరిగే ఇంటర్‌ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ‘రైళ్ల రద్దు అంశాన్ని ప్రయాణికులందరికీ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేశాం. అయినప్పటికీ తాము ప్రయాణించనున్న రైలు స్టేటస్‌ను ప్రయాణికులు కన్‌ఫర్మ్‌ చేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం’ అంటూ రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

More Telugu News