vishal: 'పందెం కోడి 3' చేస్తే మళ్లీ కీర్తి సురేశ్ కే ఛాన్స్: విశాల్

  • కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది 
  • కొత్తగా యాక్షన్ సీన్స్ కూడా చేసింది
  • వరలక్ష్మి పాత్ర కూడా గుర్తుండిపోతుంది

విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో 'పందెం కోడి 2' సినిమా నిర్మితమైంది. దసరా కానుకగా తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ .. " కెరియర్ ఆరంభంలో లింగుస్వామి దర్శకత్వంలో 'పందెం కోడి' చేసిన నేను, మళ్లీ 25వ సినిమాగా ఈ సీక్వెల్ చేయడం విశేషం. ఈ సినిమాలో నా జోడీగా కీర్తి సురేశ్ కనిపిస్తుంది.

ఇప్పటి వరకూ ఆటపాటలకే పరిమితమయ్యే పాత్రలను చేస్తూ వచ్చిన కీర్తి సురేశ్, ఈ సినిమాలో ఫైటింగులు కూడా చేసేసింది. నటన పరంగా కూడా తను చాలా అద్భుతంగా చేసింది. 'పందెం కోడి 3' చేస్తే మాత్రం అందులో కూడా కథానాయికగా కీర్తి సురేశ్ నే తీసుకుంటాము. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ నటన కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాతో నాకు మరో మంచి హిట్ పడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.  

More Telugu News