Mumbai: ముంబై లోకల్ ట్రయిన్ లో 17 ఏళ్ల యువతి స్టంట్స్... తృటిలో తప్పించుకుంది... వీడియో!

  • పట్టుజారి కిందపడ్డ యువతి
  • చెయ్యి పట్టుకున్న యువకుడు
  • మిగతావారి సాయంతో పైకి వచ్చిన అమ్మాయి

తన అత్యుత్సాహంతో ప్రాణాలపైకి తెచ్చుకుని తృటిలో ప్రాణాలు దక్కించుకున్న ఓ యువతి కథ ఇది. ముంబైలోని ఓ లోకల్ రైలులో ఫుట్ బోర్డు వద్ద నిలబడిన 17 ఏళ్ల అమ్మాయి స్టంట్స్ చేయబోతూ, పట్టుజారి కిందకు పడిపోయింది. ఆ సమయంలో పక్కనే నిలుచున్న ఓ యువకుడు ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. ఆ వెంటనే పక్కనున్నవారు ఆమెను పైకి లాగారు. ఆ యువకుడు అమ్మాయి చేతిని పట్టుకోకుంటే రైలు వెళుతున్న వేగానికి ఆమె కచ్చితంగా మరణించి ఉండేదని ఈ వీడియో చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ అమ్మాయి స్టంట్స్ ను వీడియో తీస్తున్న ఓ కెమెరాలో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News