kcr: కేసీఆర్ ను ఛీ కొడుతున్నారు: చాడ వెంకటరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారాన్ని కట్టబెడితే... పాలనాకాలం పూర్తి కాకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేశారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులంతా కేసీఆర్ ను ఛీ కొడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ను ఎందుకు ఎత్తేశారో కూడా కేసీఆర్ చెప్పలేదని దుయ్యబట్టారు. హుస్నాబాద్ సభ తర్వాత కేసీఆర్ ఇంత వరకు కనిపించలేదని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన కావాలా? లేక నియంత పాలన కావాలా? అనే విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమైపోయానని విమర్శించారు.
Go Back to Shorts
kcr
chada venkat reddy
cpi
TRS

More Telugu News