Dollar: రూపాయి ఆల్ టైమ్ రికార్డు పతనం... రూ. 73 దాటేసిన డాలర్ విలువ!

  • రూ. 73.30 వద్ద కొనసాగుతున్న డాలర్ విలువ
  • ఒక్క రోజులో 81 పైసలు నష్టపోయిన రూపాయి
  • డాలర్ కు డిమాండ్ పెరుగుతోందన్న నిపుణులు

భారత కరెన్సీ రూపాయి విలువ మరింతగా పాతాళానికి దిగజారింది. డాలర్ తో మారకపు విలువలో గత కొన్ని నెలలుగా పడిపోతున్న రూపాయి, ఈ ఉదయం రూ. 73.30కు చేరింది. రూపాయి మారకపు విలువ ఈ స్థాయికి చేరడం చరిత్రలో ఇదే ప్రథమం. సోమవారం నాటి ముగింపు రూ. 72.91తో పోలిస్తే, ఇది 81 పైసలు అధికం.

ఇటీవలి కాలంలో గంటల వ్యవధిలో రూపాయి విలువ 81 పైసలు దిగజారిన సందర్భం ఇదే కావడం గమనార్హం. డాలర్ కు డిమాండ్ పెరగడంతోనే రూపాయి విలువ పడిపోయిందని ఫారెక్స్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇదిలావుండగా, ఈ ఉదయం స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల బాట పట్టాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 175 పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 60 పాయింట్లకు పైగా పతనమైంది.

More Telugu News