Chandrababu: చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు: సోము వీర్రాజు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఏపీ బీజేపీ నేతల సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో సుమారు మూడు గంటలపాటు అమిత్ షా చర్చించారు.

అనంతరం సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారని, ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లుపొడిచారని విమర్శించారు. వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు, ప్రధాని మోదీపై ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు.

2019లో చంద్రబాబు రాజకీయ జీవితం అంతమవుతుందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని కేవలం 30 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తామని జోస్యం చెప్పారు. ఏపీలోని లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ అమిత్ షా దిశానిర్దేశం చేశారని, క్షేత్ర స్థాయిలో వాటిని అమలు చేసి ఫలితాలు సాధించి చూపిస్తామని సోము వీర్రాజు అన్నారు.
Go Back to Shorts
Chandrababu
somu veeraju

More Telugu News