దమ్ముంటే కొండా దంపతులను ఢీకొను: కడియం శ్రీహరికి కాంగ్రెస్ నేత విద్యాసాగర్ సవాల్
- తాటికొండ రాజయ్య నుంచి డిప్యూటీ సీఎం పదవి లాక్కున్నారు
- ఇప్పుడు టికెట్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు
- కొండా దంపతులు పారిపోయారంటూ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపు తగాదాలను కడియం శ్రీహరి ప్రోత్సహిస్తున్నారని విద్యాసాగర్ అన్నారు. నన్నపునేని నరేందర్ ను కార్పొరేటర్ గా గెలిపించింది కొండా దంపతులేనని... అలాంటి వారిని భయంతో పారిపోయారంటూ శ్రీహరి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. బండా ప్రకాశ్ కు రాజ్యసభ పదవిని ఇప్పించి ఉద్యమకారులకు శ్రీహరి ద్రోహం చేశారని మండిపడ్డారు.