Anantapur District: విప్ యామినీబాలకు సవాల్ విసిరిన పద్మావతి... శింగనమలలో అరెస్టు.. ఉద్రిక్తత!

  • అవినీతిపై బహిరంగ చర్చకు పిలుపు
  • నార్సల గ్రామానికి బయలుదేరిన పద్మావతి, యామినీబాల
  • పద్మావతిని, ఆమె భర్తను కదలనివ్వని పోలీసులు
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతల మధ్య నెలకొన్న వివాదం ముదరడంతో, పోలీసులు రంగ ప్రవేశం చేయగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం పార్టీ నాలుగున్నరేళ్ల పాలన, అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వైకాపా శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి సవాల్‌ విసరడంతో, టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యామినీబాల స్పందించారు.

చర్చించేందుకు నార్పల గ్రామానికి వెళ్లేందుకు ఇద్దరు నేతలూ ప్రయత్నించిన వేళ, శాంతి భద్రతలు అదుపుతప్పుతాయన్న ఆలోచనలో పోలీసులు జొన్నలగడ్డ పద్మావతిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో భగ్గుమన్న వైకాపా నేతలు, పద్మావతి అరెస్ట్‌ ను నిరసిస్తూ, ఆందోళన నిర్వహించారు. మరోవైపు పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలు చర్చకు రాకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని పారిపోయారని ఈ సందర్భంగా జొన్నలగడ్డ పద్మావతి ఆరోపించారు.
Anantapur District
Singanamala
Yamini Bala
Jonnalagadda Padmavati

More Telugu News