vijay devarakonda: ఇకపై నిర్మాతగానూ విజయ్ దేవరకొండ!
- విజయ్ దేవరకొండ హీరోగా 'నోటా'
- త్వరలో సొంత బ్యానర్ ఏర్పాటు
- నాలుగైదు భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్
మొదటి నుంచి కూడా విజయ్ దేవరకొండ తన దూకుడు చూపుతూనే వస్తున్నాడు. విజయ్ దేవరకొండను దగ్గర నుంచి చూసిన వాళ్లకి, ఆయనకి నాన్చుడు ధోరణి ఇష్టం ఉండదనే విషయం అర్థమైపోయి ఉంటుంది. ఈ కారణంగానే ఆయన చేయదలచుకున్నది చేసేస్తుంటాడు. ఓ మూడు హిట్లు కొట్టాడో లేదో .. ఆయన నిర్మాతగానూ మారిపోతున్నాడు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం వలన, ఇందులో సందేహించవలసిన అవసరం లేదు. 'మా రౌడీస్ అంతా ప్రొడక్షన్ లోకి అడుగుపెడుతున్నారు. మా ప్రొడక్షన్ లో జ్ఞానవేల్ రాజా పార్టనర్ గా చేరడం ఎంతో ఆనందంగా వుంది. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాలు గ్రాండ్ గా ఉంటాయి .. నాలుగైదు భాషల్లో విడుదలవుతాయి" అని ఆయన తాజాగా హైదరాబాద్ లో జరిగిన 'నోటా' పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆయన కమిటైన సినిమాలు పూర్తి కాగానే సొంత బ్యానర్ ఏర్పాటుపై పూర్తి దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తోంది.