Mumbai: ఢిల్లీ నుంచి ముంబై, కోల్ కతా నగరాలకు జంబో విమానాలు!

షార్ట్స్‌లో చూడండి
  దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎయిర్ ఇండియా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా  రద్దీ ఎక్కువగా ఉండే ముంబై, కోల్ కతా నగరాలకు డబుల్ డెక్కర్ విమానాలను నడపాలని నిర్ణయించింది.  ఈ నెల 16 నుంచి 21 వరకు ఢిల్లీ నుంచి ఈ రెండు ప్రాంతాలకు రోజుకు ఓ విమానాన్ని నడుపనున్నారు.  

423 సీట్ల సామర్థ్యమున్న బోయింగ్‌ 747 డబుల్‌ డెక్కర్‌ విమానంలో 12 ఫస్ట్‌ క్లాస్‌, 26 బిజినెస్‌, 385 ఎకానమీ సీట్లు ఉన్నాయి. మొదటి దశలో భాగంగా కోల్‌కతాకు ఈ డబుల్‌ డెక్కర్‌ విమానాన్ని నడపనుండగా, రెండో దశ (నవంబరు)లో ముంబైకి సేవలు అందించనుంది. నాలుగు ఇంజిన్లతో ఉండే ఈ విమానాలను సాధారణంగా వీవీఐపీల అంతర్జాతీయ పర్యటనలకు ఉపయోగిస్తుంటారు. నవంబరు 1 నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీ-ముంబయి-ఢిల్లీ సెక్టార్‌లో రోజుకు రెండు జంబో విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. 
Go Back to Shorts
Mumbai
Kolkata
jumbo flight

More Telugu News