aravindaswami: తమిళనాట 'నవాబ్' దూకుడు.. 50 కోట్ల క్లబ్ దిశగా పరుగులు!

  • ఈ నెల 27న వచ్చిన 'చక్క చివంత వానమ్'
  • 4 రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్ వసూలు 
  • మణిరత్నం కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్   

మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో 'చక్క చివంత వానం' సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాకి 'నవాబ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ నెల 27వ తేదీన ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగులో సరైన ప్రమోషన్స్ లేని కారణంగా ఈ సినిమా పెద్దగా జనం దృష్టిని ఆకర్షించలేదు. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమా వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

మొదటి మూడు రోజులకు గాను ఈ సినిమా 21.70 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నిన్న ఆదివారం రోజున 8 కోట్ల గ్రాస్ వసూలు చేసి 30 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మణిరత్నం కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా ఇదేనని చెబుతున్నారు. ఇక రేపు సెలవు రోజు కావడంతో ఈ రెండు రోజుల్లోను కలుపుకుని ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని అంటున్నారు.

More Telugu News