Nani: 'దేవదాస్'లో డిలీటెడ్ సీన్... పోస్టు చేసిన నాని... చూడండి!

  • గత శుక్రవారం విడుదలైన 'దేవదాస్'
  • ఓ కార్పొరేట్ ఆసుపత్రి సీన్ ను చూపించిన నాని
  • నిడివి కారణంగా సినిమాలో చేర్చని సీన్ 

అక్కినేని నాగార్జున, నాని నటించిన 'దేవదాస్‌' చిత్రంలోని డిలీట్ చేసిన ఓ సీన్ ను నాని తన అభిమానులతో పంచుకున్నాడు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ సన్నివేశాన్ని తెరకెక్కించగా, రావు రమేశ్ తో వాదనకు దిగే సీన్ ఇది. మాఫియా డాన్ 'దేవ'కు చికిత్స చేసిన తరువాత, తనను తిరిగి డాక్టర్ గా చేర్చుకోవాలని కోరేందుకు వచ్చిన వేళ ఈ సీన్ ఉంటుందట.

నాని వృత్తిని, అర్హతను కించపరుస్తూ మాట్లాడగా, ఆగ్రహంతో నాని మాట్లాడే మాటలు ఇప్పుడు అభిమానులను అలరిస్తున్నాయి. "నేను బయట ఎన్ని కేసులు డీల్‌ చేశానో తెలుసా?" అంటూ ప్రారంభమయ్యే నాని డైలాగుల్లో, పేపర్‌ తో గొంతుకోయొచ్చని తెలుసా? ఈ చేతులతో ఎన్ని బుల్లెట్లు తీశానో తెలుసా? అంటూ ఉద్వేగంతో చెప్పిన డైలాగులు హైలైట్ గా ఉన్నాయి. నిడివి ఎక్కువైన కారణంగానే ఈ సీన్ ను సినిమాలో చేర్చలేదని సమాచారం. ఆ సీన్ ను ఓ సారి మీరూ చూసేయండి.

More Telugu News