Hyderabad: చిచ్చుపెట్టిన సెల్ ఫోన్ చాటింగ్.. మహిళ ఆత్మహత్య!

  • హైదరాబాద్ పరిధిలో ఘటన
  • వివాహిత సెల్ ఫోన్ అసభ్యకర సందేశాలు
  • ఫోన్ మార్చిన తరువాత యువతికి కష్టాలు
  • మనస్తాపంతో ఆత్మహత్య

సెల్ ఫోన్ మెసేజ్ లు ఓ కాపురంలో చిచ్చు పెట్టి, వివాహిత ఆత్మహత్యకు కారణమయ్యాయి. హైదరాబాద్ పరిధిలోని పేట్ బషీరాబాద్ లో జరిగిన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన రమేశ్‌, అనితలు దూలపల్లి బీసీ కాలనీలో నివాసం ఉంటుండగా, వీరికి కుమార్తె శ్వేత, కుమారుడు నవీన్‌ ఉన్నారు. రమేశ్‌ ఆటో డ్రైవర్‌ గా పని చేస్తుండగా,  శ్వేత చింతల్‌ లోని వనిత బాలికల డిగ్రీ కళాశాలలో చదువుకుంటోంది.

శ్వేత సెల్ ఫోన్ నంబరును సేకరించిన సాయితేజ అనే యువకుడు, పరిచయం పెంచుకుని, ఆపై అసభ్యకర సందేశాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. అతని మెసేజ్ లు హద్దులు మీరుతుండటంతో, తన ఫోన్‌ పోయిందని కుటుంబీకులకు తెలిపిన శ్వేత, ఆ ఫోన్‌ నంబరును వరుసకు బావయ్యే శ్రీకాంత్‌ అనే యువకుడికి ఇచ్చింది. శ్రీకాంత్ అందులోని మెసేజ్ లను చూసి, ఆగ్రహంతో, సాయితేజను పిలిపించి దాడిచేశాడు.

ఈ విషయమై సాయితేజ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. శ్రీకాంత్‌ కు రూ.10 వేల జరిమానా విధించడంతో, దాన్ని చెల్లించి బయటకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న శ్వేత, తన కారణంగా బావకు జరిమానా పడిందన్న మనస్తాపంతో, సీలింగ్‌ ఫ్యాన్‌ కు ఉరేసుకొని ఆత్యహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News