నేడు కూడా... హైదరాబాద్, విజయవాడల్లో తాజా పెట్రోలు, డీజిల్ ధరలు!

  • పెట్రోలుపై 9 పైసలు, డీజిల్ పై 15 పైసలు వడ్డన
  • హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 88.51కి
  • ముంబైలో రూ. 90.84కు
పెట్రోలు ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. నేడు కూడా ధరలను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. ఆదివారం నాడు లీటరు పెట్రోలుపై 9 పైసలు, డీజెల్ పై 15 పైసల మేరకు ధరలను పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.

దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 88.51కి, డీజిల్ ధర రూ. 81.33కు పెరిగాయి. ఇదే సమయంలో విజయవాడలో పెట్రోలు ధర లీటరుకు రూ. 87.86కు, డీజిల్ ధర రూ. 80.35కు చేరింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 83.49గా, డీజిల్ ధర రూ. 74.79గా ఉంది. ఇక పెట్రో ఉత్పత్తుల ధరలు అధికంగా ఉండే ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 90.84కు, డీజిల్ ధర రూ. 79.40కి చేరుకుంది.
Go Back to Shorts
Petrol
Diesel
OMCs
Price Hike

More Telugu News