జియోకి పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు కొత్త ప్లాన్!

Sat, Sep 29, 2018, 04:42 PM
  • 18వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త ప్లాన్
  • ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.18 ప్లాన్‌ ప్రకటన
  • 18% అదనపు టాక్ టైమ్ తో మరో మూడు ప్లాన్లు కూడా విడుదల
18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.18 పేరిట కొత్త ప్లాన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ప్రకారం అన్ని నెట్ వర్క్ లకి ఎలాంటి పరిమితి లేకుండా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రెండు రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ డేటాని ఉపయోగించుకునే వీలు ఉంది.

అలాగే, 18% అదనపు టాక్ టైమ్ తో రూ.1801 (రూ.2125 టాక్ టైమ్), రూ.1201 (రూ.1417 టాక్ టైమ్), రూ.601 (రూ.709 టాక్ టైమ్)లాంటి మరో మూడు ప్లాన్ లని కూడా ప్రకటించింది. ఈ మూడు ప్లాన్ లలో వరుసగా 15 జీబీ డేటా, 10 జీబీ డేటా, 5జీబీ డేటాని పొందుతారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha