రేవంత్ రెడ్డి భార్యను బ్యాంకుకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు

  • రేవంత్ నివాసంలో కొనసాగుతున్న తనిఖీలు
  • అరెస్ట్ చేస్తారనే వార్తలతో భారీ ఎత్తున చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు
  • రేవంత్ నివాసం వద్ద మోహరించిన పోలీసులు
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి చెందిన జూబ్లీహిల్స్ నివాసంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు రేవంత్ భార్య గీతను ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. బ్యాంకులో ఉన్న లాకర్లను తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో, ఆయన నివాసం వద్దకు భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. అయితే, తాము రేవంత్ ను అరెస్ట్ చేయడానికి రాలేదని, కేవలం భద్రత కోసమే వచ్చామని పోలీసులు చెబుతున్నారు. రేవంత్ నివాసం వద్దకు డీకే అరుణ, సీతక్కతో పాటు పలువురు నేతలు చేరుకున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
wife
geetha
TRS
congress

More Telugu News