Chinthamaneni Prabhakar: టీవీ ఛానల్ కొన్నావ్.. అందులో నన్ను అసెంబ్లీ రౌడీగా చూపించావ్!: పవన్ పై చింతమనేని గుస్సా
- నా పిల్లాడు ఆ కథనాలు చూసి బాధపడ్డాడు
- దమ్ముంటే దెందులూరులో నాపై పోటీ చేయ్
- నువ్వు గెలిస్తే నీతో కలిసి సంబరాల్లో పాల్గొంటా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సొంత టీవీ ఛానల్ లో తనను ‘అసెంబ్లీ రౌడీ’గా చూపిస్తున్నాడని ఏపీ ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీ రౌడీ అంటూ తన ఫొటోను టీవీలో మాటిమాటికి చూపారని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించేందుకు పవన్ ఎక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేసినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు. నిన్న దెందులూరు బహిరంగ సభలో జనసేనాని విమర్శించిన నేపథ్యంలో ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతమనేని జవాబిచ్చారు.
పవన్ కల్యాణ్ ఇటీవల కొన్న తన ఛానల్ లో తన గురించి ఇష్టానుసారంగా కథనాలు ప్రసారం చేశారని చింతమనేని మండిపడ్డారు. ‘‘నువ్వు కొన్న టీవీ ఛానల్ లో నేను అసెంబ్లీ రౌడీనని నా ఫొటోను చూపావ్. మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికొచ్చిన నా కొడుకు ‘నాన్నా.. ఇదేంటి పవన్ కల్యాణ్ నిన్ను అసెంబ్లీ రౌడీ అని అంటున్నాడు?’ అని అడిగాడు.
"అవును, అసెంబ్లీ రౌడీ సినిమాలో శివాజీ (మోహన్ బాబు) గెలిచినట్లు నేను నీ మీద గెలిచి అసెంబ్లీకి రాకుంటే మళ్లీ ప్రజల్లో తిరగను’’ అని చింతమనేని స్పష్టం చేశారు. ఆ కథనంతో తన కుమారుడు బాధపడ్డాడని చింతమనేని తెలిపారు. దమ్ముంటే పవన్ కల్యాణ్ తనపై పోటీ చేయాలని సవాలు విసిరారు. పవన్ తనపై గెలిస్తే ఆయనతో కలిసి సంబరాల్లో పాల్గొంటాననీ, పవన్ ఓడిపోతే తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతే చాలని వ్యాఖ్యానించారు.
జనసేన పార్టీకి చెందిన నేత తోట చంద్రశేఖర్ టీవీ99 ఛానల్ ను కొన్నిరోజుల క్రితం కొనుగోలు చేసినట్టు వార్తలొచ్చాయి. మాజీ ఐఏఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ గతంలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు.