revanth reddy: ఐటీ దాడులపై స్పందించిన రేవంత్ రెడ్డి

  • ఐటీ అధికారులమంటూ కొందరు ఫోన్ చేశారు
  • ఎన్నికల ప్రచారంలో వున్నానని చెప్పడంతో ఫోన్ పెట్టేశారు
  • కొడంగల్ లోని తన నివాసంలో ఎలాంటి సోదాలు జరగడం లేదు
తమ నివాసాలపై ఐటీ అధికారులు నిర్వహిస్తున్న దాడులపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. ఐటీ అధికారులమంటూ తనకు కొందరు ఫోన్ చేశారని... ఎన్నికల ప్రచారంలో వున్నానని చెప్పడంతో వారు ఫొన్ పెట్టేశారని ఆయన తెలిపారు. ఈరోజు రాత్రికి హైదరాబాద్ వస్తున్నట్టు చెప్పారు. కొడంగల్ లోని తన నివాసంలో ఎలాంటి సోదాలు జరగడం లేదని తెలిపారు. హైదరాబాదులోని తన బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చిందని చెప్పారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు. 
revanth reddy
it
raids
congress

More Telugu News