komatireddy: ఏదో ఆవేశంలో మాట్లాడిన మాటలను రాద్ధాంతం చేయడం సరికాదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • క్రమశిక్షణా సంఘం ఏ చర్య తీసుకున్నా కట్టుబడి ఉంటా
  • సోనియా, రాహుల్ లను తప్పుదోవపట్టిస్తున్నారు
  • టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీ-పీసీసీ రెండు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏదో ఆవేశంలో తాను మాట్లాడిన మాటలను రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు.

హైకమాండ్, క్రమశిక్షణా సంఘం తనపై ఏ చర్య తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. సోనియా, రాహుల్ లను తెలంగాణ నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని, ఇలాంటి సమయంలో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా అధికారంలోకి రాలేమని అభిప్రాయపడ్డారు.

టీడీపీతో పొత్తు పెట్టుకున్నా గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని సూచించారు. మునుగోడు నుంచి తనను పోటీ చేయమని ప్రజలు కోరుతున్నారని, పోటీ చేసే అవకాశమిస్తే అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతానని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News