nani: తమిళ రీమేక్ పట్ల నాని ఆసక్తి .. నిర్మాతగా దిల్ రాజు

  • నాని తాజా చిత్రంగా 'దేవదాస్'
  • తదుపరి సినిమాగా 'జెర్సీ'
  • దిల్ రాజు నిర్మాతగా మరో మూవీ

నాని తాజా చిత్రంగా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'దేవదాస్' రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన 'జెర్సీ' అనే మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాని మరో ప్రాజెక్టుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇది తమిళ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది.

తమిళంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా '96' మూవీ రూపొందింది. విభిన్నమైన కంటెంట్ తో నిర్మితమైన ఈ సినిమాను తమిళంలో వచ్చేనెల 4వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కథా కథనాలు నచ్చడంతో తెలుగు రీమేక్ రైట్స్ ను దిల్ రాజు దక్కించుకున్నారట. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను తెలుగులో నాని చేస్తే బాగుంటుందని భావించిన దిల్ రాజు, ఆ సినిమాను నానికి చూపించారట. నాని కూడా ఈ సినిమా చేయడానికి సానుకూలంగా స్పందించడం జరిగిందని అంటున్నారు.   

More Telugu News