Kerala: అత్యాచారం కేసులో జైలుకెళ్లే ముందు చేపల కూరతో భోజనం చేసిన బిషప్... జైల్లో హాయిగా నిద్ర!

  • సన్యాసినిపై 13 సార్లు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు
  • 12 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధింపు
  • కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేయనున్న పోలీసులు

కేరళకు చెందిన ఓ సన్యాసినిపై 13 సార్లు అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటూ, ఇటీవల అరెస్టయిన బిషప్ ప్రాంకో ములక్కల్ ను 12 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ పాలా మెజిస్ట్రేట్ లక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఆపై పోలీసులు ప్రాంకో ములక్కల్ ను కొట్టాయం జైలుకు తరలించగా, జైలుకు వెళ్లే ముందు బిషప్ తనకెంతో ఇష్టమైన చేపలకూరతో భోజనం చేశాడట. ఈ విషయాన్ని జైలు అధికారులే చెప్పారు.

 ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 5968ను కేటాయించామని, సాధారణ గదిలోనే ఉంచామని అన్నారు. జైలు గదిలో బిషప్ చాలా ప్రశాంతంగా ఉన్నాడని, గదిలోకి వచ్చిన వెంటనే హాయిగా నిద్రపోయాడని కూడా జైలు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ కేసులో బిషప్ ను ప్రశ్నించేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ ను దాఖలు చేయనున్నారు.

More Telugu News