Rambha: పండంటి బాబుకు జన్మనిచ్చిన నటి రంభ

  • ఈ నెల 23న బాబుకు జన్మనిచ్చిన రంభ
  • ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఇంద్రకుమార్

టాలీవుడ్ నటి రంభ ఈ నెల 23న పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. రెండు రోజుల క్రితం తమకు మగబిడ్డ జన్మించాడంటూ రంభ భర్త ఇంద్రకుమార్ సోషల్ మీడియా ద్వారా  వెల్లడించారు. రంభ-ఇంద్రకుమార్‌ల వివాహం 2010లో జరిగింది. ప్రస్తుతం వీరు టొరొంటోలో స్థిరపడ్డారు. వీరికి ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలున్నారు. తాజాగా బాబుకు జన్మనిచ్చింది. టాలీవుడ్‌లో రంభ ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. ప్రముఖ అగ్రహీరోలందరితోనూ సినిమాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.

More Telugu News