bofors scam: ‘బోఫోర్స్’ కన్నా రాఫెల్ కుంభకోణం అతిపెద్దది: ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

  • రాఫెల్ కుంభకోణంతో కేంద్రం నిండా మునిగిపోయింది
  • ఈ కుంభకోణం రూ.50 వేల కోట్లకు చేరింది
  • జీవీఎల్ కు మతిభ్రమించిందేమో!

రాఫెల్ కుంభకోణంతో కేంద్రం నిండా మునిగిపోయిందని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోఫోర్స్ కుంభకోణం కంటే రాఫెల్ స్కామ్ అతిపెద్దదని, ఎన్డీఏ మునిగిపోతున్న నావ అని అన్నారు. రాఫెల్ కుంభకోణం రూ.50 వేల కోట్లకు చేరిందని ఆరోపించారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ పైనా ఆయన మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు మతిభ్రమించిందేమోననే అనుమానం కలుగుతోందని అన్నారు. పూర్తిగా అన్నీ అబద్ధాలు చెప్పే వారిపై పార్లమెంట్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, జీవీఎల్ పై ఫిర్యాదు చేస్తానని ఈ సందర్భంగా కుటుంబరావు హెచ్చరించారు.

ఇప్పటివరకు మోదీ తొంభైసార్లు విదేశీపర్యటనలు చేశారని, అత్యధికంగా అమెరికా, చైనా దేశాలకు ఆయన వెళ్లారని, ఆ రెండు దేశాలతో మన సంబంధాలు ఎలా ఉన్నాయో చూడండి అని కుటుంబరావు విమర్శించారు.  

More Telugu News