paruchuri: అంత చిన్న సినిమా ఆ స్థాయి హిట్ కొడుతుందని ఎవరూ ఊహించలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • పెద్ద సినిమాలు మాత్రమే రాస్తున్నాము 
  • ఓ రోజున మోహన్ గాంధీ వచ్చారు 
  • చిన్న బడ్జెట్ సినిమాకి రాయమన్నారు

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, దర్శకుడు ఎ.మోహన్ గాంధీ గురించి ప్రస్తావించారు. 'అనురాగదేవత' విజయం తరువాత అందరూ పెద్ద దర్శకులే మా దగ్గరికి వచ్చి .. పెద్ద సినిమాలు రాయిస్తున్నారు. ఆ సమయంలో మోహన్ గాంధీ గారు మా దగ్గరికి వచ్చారు. 'నా దగ్గర ఓ కథ వుందండి .. చాలా తక్కువ డబ్బులు ఇప్పించగలుగుతాను .. మాటలు రాస్తారా?' అని అడిగారు.

'కథ నచ్చితే రాస్తాము' అని చెప్పాము. ఆయన చెప్పిన కథ నిజంగా మాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి మేము రాస్తున్నామని రాఘవేంద్రరావుగారికి తెలిసి, 'టెర్రర్ ' లాంటి సినిమాలు ఒప్పుకుంటే 'ఉయ్యూరు' పంపించేస్తాను' అన్నారు. అంత చిన్న సినిమా అని చెప్పడం కోసం నేను ఈ విషయం ప్రస్తావించాను. 'టెర్రర్' రిలీజ్ అయిన తరువాత అద్భుతాలు సృష్టించింది. తెలుగులో నూరు రోజులు ఆడేసింది. కన్నడలో ప్రభాకర్ హీరోగా చేయగా అక్కడ కూడా 100 రోజులు ఆడేసింది. చిన్న బడ్జెట్ .. పెద్ద బడ్జెట్ అనేది కాదు .. కథలో విషయం ఉండాలి .. అది ప్రేక్షకులలోకి వెళ్లాలి అనే విషయాన్ని ఈ సినిమా మరోమారు నిరూపించింది" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News