Narendra Modi: నోబెల్ శాంతి బహుమతి కోసం మోదీ పేరును ప్రతిపాదిస్తున్న తమిళనాడు బీజేపీ చీఫ్!

  • మోదీని నామినేట్ చేసిన తమిళనాడు బీజేపీ చీఫ్
  • ఆయుష్మాన్ భారత్ పథకంతో కోట్లాది మందికి ఆరోగ్య భరోసా
  • మోదీకి అందరూ మద్దతివ్వాలని కోరిన సౌందరరాజన్

2019 సంవత్సరానికిగాను నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రధాని నరేంద్ర మోదీని నామినేట్ చేస్తున్నట్టు బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలు డాక్టర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. ఈ విషయంలో తనతో పాటు ప్రజలంతా మోదీకి మద్దతు పలకాలని ఆమె కోరారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించడం ద్వారా కోట్లాది మందికి ఆరోగ్య భద్రతను దగ్గర చేసినందున మోదీ శాంతి బహుమతికి అర్హుడని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద హెల్త్ కేర్ స్కీమ్ గా ఆయుష్మాన్ భారత్ పథకం శనివారం నుంచి అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న 13 వేల ఆసుపత్రులు ఈ స్కీమ్ పరిధిలో ఉంటాయి. సుమారు 50 కోట్ల మంది ప్రజలకు లబ్ధి కలుగుతుంది. ఈ పథకం గురించిన మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్ 14555 కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ప్రతిఒక్కరూ నామినేషన్లు వేయాలని సౌందరరాజన్ పిలుపునిచ్చారు.

More Telugu News