maoist: మావోయిస్టుల ఎఫెక్ట్.. రెండ్రోజుల మన్యం బంద్ కు గిరిజన సంఘాల పిలుపు!

  • నేతలను చంపేయడంపై ఆగ్రహం
  • హంతకులను పట్టుకోవాలని డిమాండ్
  • డుంబ్రిగూడ ఎస్సైని సస్పెండ్ చేసిన డీజీపీ

విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. తమ నేతలను చంపడంపై గిరిజన యువకులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో నేడు, రేపు.. రెండ్రోజుల పాటు బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. కిడారి, సోమల హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, మావోయిస్టులను ఏరివేసేందుకు విశాఖ మన్యంలో 12 స్పెషల్ పార్టీ పోలీసుల బృందాలు, 8 గ్రేహౌండ్స్ పార్టీలు కూంబింగ్ ప్రారంభించాయి.

మరోవైపు కిడారి, సోమల హత్యల తర్వాత చెలరేగిన అల్లర్లను అదుపు చేయడంతో విఫలమైనందుకు డుంబ్రిగూడ ఎస్సై అమర్ నాథ్ ను సస్పెండ్ చేసినట్లు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. 

More Telugu News