విధుల్లో నిర్లక్ష్యం.. డుంబ్రిగూడ ఎస్సైపై సస్పెన్షన్ వేటు!
- ముందస్తు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యం
- అల్లర్లను అదుపుచేయడంలో విఫలం
- వివరాలను వెల్లడించిన ఏపీ డీజీపీ ఠాకూర్
పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ నాయకులు చనిపోయారన్న ఆగ్రహంతో అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై వారి అనుచరులు దాడి చేశారు. డుంబ్రిగూడ ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఔట్ పోస్ట్ ను తగలబెట్టారు. ఫర్నీచర్, ఫైళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. దొరికిన పోలీసులను దొరికినట్లు కొట్టారు.