Tamilnadu: తమిళం అర్జున్ రెడ్డి టీజర్ విడుదల!

  • ‘వర్మ’ టైటిల్ ను ఖరారు చేసిన చిత్ర యూనిట్
  • శరవేగంగా జరుగుతున్న షూటింగ్
  • హీరో ధ్రువ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్

బోల్డ్ కంటెంట్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను హిందీ, తమిళంలో రిమేక్ చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. తాజాగా తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాను ‘వర్మ’ టైటిల్ తో దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డు విజేత మురుగన్ డైలాగ్స్ రాస్తున్నాడు. ఇక వర్మలో హీరోయిన్ గా మేఘా నటిస్తోంది. తాజాగా ధ్రువ్ పుట్టినరోజు నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ను మీరూ చూసేయండి.

More Telugu News