damodara rajanarsimha: ‘కాంగ్రెస్’ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం: దామోదర రాజనర్సింహ

  • 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ
  • ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • మేనిఫెస్టో అంశాలపై అధ్యయనానికి కమిటీలు

తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

మేనిఫెస్టోలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలపై అధ్యయనానికి కమిటీలు ఏర్పాటు చేశామని, అక్టోబర్ 10లోగా ఈ కమిటీ పని పూర్తి చేస్తామని చెప్పారు. మేనిఫెస్టోపై అభిప్రాయాలను 85238 53852 నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై ఆయన విమర్శలు గుప్పించారు. డబుల్ బెడ్ రూమ్ పేరిట ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

More Telugu News