Varalakshmi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • జయలలిత పాత్రకు వరలక్ష్మి ఎంపిక 
  • 'మన్మథుడు 2'కి నాగార్జున రెడీ 
  • థాయిలాండులో మహేశ్ బాబు హాలిడే
  • రవితేజ సినిమాకి మ్యూజిక్ సిటింగ్స్ 

*  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితకథను 'ఐరన్ లేడీ' పేరిట తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శిని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించనున్నట్టు తాజా సమాచారం.
*  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. గతంలో వచ్చిన 'మన్మథుడు' చిత్రానికి ఇది సీక్వెల్ అని అంటున్నారు. దీనికోసమే, 'మన్మథుడు 2' టైటిల్ని ఇటీవల నాగార్జున రిజిస్టర్ చేయించారట.  
*  బిజీ షూటింగ్ షెడ్యూల్ నుంచి గ్యాప్ దొరికితే కనుక మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలసి విహారయాత్రకు వెళుతుంటాడు. అలాగే, ప్రస్తుతం తన భార్య, పిల్లలతో కలసి థాయిలాండులో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు.
*  రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే చిత్రం కోసం సంగీత దర్శకుడు తమన్  నేతృత్వంలో మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మరోపక్క సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ నటించే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

More Telugu News