dubai: ఆసియా కప్.. జడేజా ఖాతాలో నాలుగు వికెట్లు

  • తొలి సూపర్ -4 మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో భారత్
  • మూడు కీలక వికెట్లు పడగొట్టిన జడేజా
  • భువనేశ్వర్ మూడు, బుమ్రా ఒక వికెట్

ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి సూపర్ -4 మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, బంగ్లాదేశ్ టీమ్ బ్యాటింగ్ కు దిగింది. చాలా రోజుల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా తన బౌలింగ్ తో దుమ్ము రేపాడు. జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా ఇందులో మూడు కీలక వికెట్లు ఉండటం గమనార్హం. షకిబ్ (17), మిథున్ (9), ముష్పికర్ రహీమ్ (21), మొసద్దక్ హుస్సేన్ (12) వికెట్లను జడేజా తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్ మూడు వికెట్లు తీసుకోగా, బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, 46.3 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 167 పరుగులు చేసింది. 

More Telugu News