kohli: కోహ్లీని తూలనాడి.. గంభీర్ ఆగ్రహానికి గురైన పాక్ మాజీ క్రికెటర్!

  • కోహ్లీపై తన్వీర్‌ అహ్మద్‌ వ్యంగ్యాస్త్రాలు
  • ఆసియా కప్‌ నుంచి కోహ్లీ పారిపోయాడన్న తన్వీర్
  • ఘాటు సమాధానమిచ్చిన గంభీర్

ఆసియాకప్‌ నుంచి పారిపోయాడంటూ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ తన్వీర్‌ అహ్మద్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ వ్యాఖ్యల పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. ‘విరాట్‌ కోహ్లీ పేరుమీద ఇప్పటికే 35-36 సెంచరీల రికార్డు ఉంది. అతనికి మరో సెంచరీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తన్వీర్‌ పేరుమీద కనీసం 36 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దాఖలాలు కూడా లేవు. అది గుర్తు పెట్టుకుంటే మంచిది’ అంటూ గంభీర్ చురక అంటించాడు.  

కోహ్లీ కొంతకాలంగా విరామం లేకుండా ఆడుతున్నాడు. దీంతో అతను వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమయంలో సెలక్టర్లు కాస్త విరామం ఇచ్చారు. దీంతో ఆయనకు విశ్రాంతి తీసుకునేందుకు సమయం దొరికనట్టైంది. కానీ దీనిపై తన్వీర్ వ్యంగాస్త్రాలు సంధించాడు. ‘‘ కోహ్లీ పాకిస్థాన్ జట్టుకు భయపడే పారిపోయాడని నేను భావిస్తున్నా. ఇంగ్లాండ్‌‌తో అన్ని సిరీస్‌లూ ఆడాడు. దేశం కోసం ఇంగ్లాండ్‌తో ఆడిన వ్యక్తి ఆసియా కప్‌కు ఆడలేడా? భారత్ మూడు సార్లు పాకిస్థాన్‌తో తలపడాల్సి వస్తుందని ముందే భావించి కోహ్లీ పారిపోయాడు’’ అని తూలనాడటంతో గంభీర్ ఆగ్రహానికి గురయ్యాడు. 

More Telugu News