ramesh rathode: కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ నేత రమేష్ రాథోడ్

  • కుంతియా, ఉత్తమ్, జానారెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
  • టీఆర్ఎస్ టికెట్ రేఖా నాయక్ కు కేటాయించడంపై రమేష్ అసంతృప్తి
  • ఖానాపూర్ టికెట్ రమేష్ కు లభించే అవకాశం
టీఆర్ఎస్ నేత రమేష్ రాథోడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. రమేష్ కు వీరంతా పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ టికెట్ ను తాజా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు కేటాయించడంపై రమేష్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో, తన అనుచరులు, మద్దతుదారులతో కలసి రమేష్ కాంగ్రెస్ లో చేరారు. అయితే, ఆయనకు ఖానాపూర్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారా? లేదా? అనే విషయం తెలియరాలేదు.  
ramesh rathode
khanapur
TRS
congress

More Telugu News