vietnam: వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ కన్నుమూత!

  • హనోయ్ లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • 2016 ఏప్రిల్ 2 నుంచి అధ్యక్షుడిగా ఉన్న క్వాంగ్
  • గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అధ్యక్షుడు 
వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ కన్నుమూశారు. ఈ ఉదయం 10.05 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత పది రోజులుగా వియత్నాం రాజధాని హనోయ్ లోని సైనిక ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించి, ఈ ఉదయం ఆయన మృతి చెందినట్టు మిలిటరీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

క్వాగ్ వయసు 61 సంవత్సరాలు. 2016 ఏప్రిల్ 2 నుంచి ఆయన ఆ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మాజీ అధ్యక్షుడు తాన్ సాంగ్ ఆయన పేరును ప్రతిపాదించగా... వియత్నాం పార్లమెంటు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అధ్యక్షుడు కాకముందు ఆయన దేశ ప్రజాభద్రత మంత్రిగా పని చేశారు.
vietnam
president
tran dai quang
dead

More Telugu News