Nokia 5.1 Plus: నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్ రాబోతోంది!

  • గత నెలలోనే నోకియా 5.1 ప్లస్‌ భారత్ లో విడుదల
  • ఈ నెల 24న మార్కెట్లోకి
  • ఫ్లిప్‌కార్ట్, నోకియా ఆన్ లైన్ స్టోర్లలో లభ్యం

గత నెలలో ఇండియాలో విడుదలైన నోకియా 5.1 ప్లస్‌ స్మార్ట్ ఫోన్ ఈ నెల 24న మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. నోకియా ఆన్ లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్‌లో దీనిని ప్రత్యేకంగా విక్రయించనున్నారు. బ్లాక్, వైట్, బ్లూ కలర్ వేరియెంట్లలో లభించే ఈ ఫోన్ ఫస్ట్ లుక్, ఫీచర్లు వెల్లడించినప్పటికీ ధర వివరాలని మాత్రం ప్రకటించలేదు.

నోకియా 5.1 ప్లస్ ప్రత్యేకతలు:

  • 5.86" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే( 720 x 1520 స్క్రీన్ రిజల్యూషన్)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • వెనక భాగంలో 13/5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు
  • ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • పీ60 ఆక్టాకోర్ ప్రాసెసర్
  • 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (400 జీబీ వరకు పెంచుకోవచ్చు)
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3060ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News