nagarjuna: ఆసక్తిని రేపుతోన్న 'దేవదాస్' ట్రైలర్

  • వినోదాత్మక చిత్రంగా 'దేవదాస్'
  • డాన్ .. డాక్టర్ పాత్రల్లో నాగ్ - నాని 
  • ఈ నెల 27వ తేదీన విడుదల

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా 'దేవదాస్' సినిమా రూపొందింది. ఆకాంక్ష సింగ్ .. రష్మిక మందన కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 27వ తేదీన ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

 లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో డాన్ గా నాగార్జున .. డాక్టర్ గా నాని కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. అందుకే 'మాఫియా సార్ .. వాళ్లతో పెట్టుకోకూడదు' .. ' డాక్టర్ సార్ .. మాతో అబద్ధం ఆడకూడదు' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'పాకెట్ లో గన్ పెట్టుకుని తిరిగేవాడితో పరిచయం పెంచుకోకూడదు .. ఏ క్షణమైనా బులెట్ దిగొచ్చు' అంటూ మురళీశర్మ చెప్పే డైలాగ్ కూడా పేలింది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News