whatsapp: పాత ఐఫోన్లకు చేదువార్త అందించిన వాట్సాప్!

  • పాత వర్షన్ ఐఫోన్లకు వాట్సాప్‌లోని కొత్త ఫీచర్లు అందవు
  • 2020 తర్వాత వాట్సాప్ సేవల నిలిపివేత
  • ఇప్పటికే ప్రారంభమైన ఉపసంహరణ విధానాలు

ప్రస్తుతం జీవితంలో వాట్సాప్ ఎలా భాగమై పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేచింది మొదలు పడుకునే వరకూ ప్రతి ఒక్కరికీ వాట్సాప్ నిత్యావసరమైపోయింది. అలాంటి వాట్సాప్ సంస్థ పాత ఐ ఫోన్ వినియోగదారులకు చేదువార్త చెప్పింది. ఐఫోన్ 4 మినహా... ఐవోఎస్ 7, ఇతర పాత వెర్షన్లపై నడిచే ఐ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు.

దీని గురించి వాట్సాప్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘పాత వర్షన్ ఐఫోన్లకు వాట్సాప్‌లోని కొత్త ఫీచర్లు అందవు. నూతనంగా వస్తున్న అప్‌డేట్స్‌ కూడా ఆ ఫోన్లకు వర్తించవు. ఇంతకు ముందున్న ఫీచర్లు కూడా పనిచేయకుండా పోయేందుకు అవకాశం ఉంది. ఐవోఎస్ వెర్షన్ 7, ఇతర పాత వెర్షన్ ఐఫోన్లలో 1 ఫిబ్రవరి 2020 తర్వాత వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నాం’ అని తెలిపారు.

ఇప్పటికే వాట్సాప్ ఉపసంహరణ విధానాలు ప్రారంభమయ్యాయి. 2020 నాటికి ఈ ఫోన్లలో వాట్సాప్ రాదు. ఒకవేళ ఐవోఎస్ 7 మీద నడిచే ఫోన్లలో వాట్పాప్ డిలీట్ అయినా కూడా తిరిగి ఇన్‌స్టాల్ చేసుకోవడం కుదరదు. 

More Telugu News