spice jet: బ్యాంకాక్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి నేరుగా సర్వీసులు ప్రారంభించిన స్పైస్‌జెట్

  • రెండు కొత్త సర్వీసులను ప్రారంభించిన స్పైస్‌జెట్
  • ప్రారంభ ఆఫర్ కింద రూ.10 వేలకే టికెట్
  • వచ్చే నెల 10 నుంచి ప్రారంభం

హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ప్రైవేటు రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ శుభవార్త చెప్పింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఫలితంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి దేశీయ విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. అలాగే, హైదరాబాద్ నుంచి గువాహటికి కూడా మరో సర్వీసును ప్రారంభించింది. ఈ రెండు సర్వీసులు అక్టోబరు పదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ సందర్భంగా తొలి టికెట్‌ను స్పైస్‌జెట్ ప్రతినిధులు కేటీఆర్‌కు అందించారు. హైదరాబాద్-బ్యాంకాక్‌ టికెట్‌ను ప్రారంభ ఆఫర్ కింద రూ. 10,001కి అందిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్-గువాహటి టికెట్ ధరను రూ.4,286గా నిర్ణయించింది. కొత్త సర్వీసుల ద్వారా వినియోగదారులకు మరింత దగ్గర కాబోతున్నట్టు స్పైస్ జెట్ తెలిపింది.

More Telugu News