Nawaz sharif: ఇస్లామాబాద్ కోర్టు తీర్పు నేపథ్యంలో నవాజ్ షరీఫ్ జైలు నుంచి విడుదల!

  • అవెన్‌ఫీల్డ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు
  • జైలు నుంచి విడుదలైన షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడు
  • భారీ భద్రత నడుమ లాహోర్‌కు తరలింపు

అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు బోల్డంత ఉపశమనం లభించింది. నవాజ్, ఆయన కుమార్తె మర్యం, అల్లుడు మహ్మద్ సఫ్దర్‌ల జైలు శిక్షను నిలిపివేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దీంతో బుధవారం రాత్రి వీరు ముగ్గురినీ జైలు నుంచి విడుదల చేశారు. అనంతరం రావల్పిండి ఎయిర్‌బేస్ నుంచి ప్రత్యేక విమానంలో పటిష్ట భద్రత మధ్య వీరిని లాహోర్‌కు తరలించారు.

లండన్‌లోని అవెన్‌ఫీల్డ్‌లో ఖరీదైన బంగళాలు కొన్నట్టు తేలడంతో నవాజ్ షరీఫ్, మర్యం నవాజ్, సప్దర్‌లకు ఆమధ్య కోర్టు జైలు శిక్ష విధించింది. దీనిపై నవాజ్ హైకోర్టులో సవాలు చేశారు. కేసును విచారించిన కోర్టు దీనిని కొట్టివేస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. విడుదలకు ముందు నవాజ్ జైలు సూపరింటెండెంట్ గదిలో తన సన్నిహితులతో మాట్లాడారు. తానేమీ తప్పు చేయలేదని, ఆ విషయం తన అంతరాత్మకు తెలుసని వ్యాఖ్యానించినట్టు పాక్ మీడియా పేర్కొంది.

More Telugu News