తెలంగాణ కాంగ్రెస్ లో పలు మార్పులు.. రేవంత్ రెడ్డికి ప్రమోషన్
- రేవంత్, పొన్నంలకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా
- ప్రచార కమిటీ ఛైర్మన్ గా భట్టి విక్రమార్క
- మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహ
ఇక ప్రచార కమిటీ ఛైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్క, కో-ఛైర్మన్ గా డీకే అరుణ, కన్వీనర్ గా దాసోజు శ్రవణ్ లను నియమించారు. 41 మందితో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. 53 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. 17 మందితో ప్రచార కమిటీ, 35 మందితో మేనిఫెస్టో కమిటీ, 20 మందితో స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేశారు.
మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు. స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతరావు నియమితులయ్యారు. ఈసీ సమన్వయ కమిటీ ఛైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డిని, పార్టీ క్రమశిక్షణ చర్యల కమిటీ ఛైర్మన్ గా కోదండరెడ్డిని నియమించారు.