vijay: 'సర్కార్' నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది

  • ఈ నెల 24వ తేదీన ఫస్టు సింగిల్ 
  • అక్టోబర్ 2వ తేదీన ఆడియో రిలీజ్ 
  • దీపావళికి సినిమా విడుదల  

మాస్ హీరోగా తమిళనాట విజయ్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తాజా చిత్రంగా మురుగదాస్ దర్శకత్వంలో 'సర్కార్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా నుంచి వస్తోన్న పోస్టర్లకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఫస్టు సింగిల్ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 ఈ నెల 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటించగా .. మరో ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చేనెల 2వ తేదీన చెన్నైలో ఆడియో వేడుకను నిర్వహించి, దీపావళికి సినిమాను రిలీజ్ చేయనున్నారు.  

More Telugu News