ప్రబోధానంద బలవంతుడు.. అందుకే నాపై దాడిచేశాడు!: జేసీ దివాకర్ రెడ్డి
- ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన జేసీ
- ఆశ్రమంలో అక్రమాలపై వీడియోలు, ఆధారాల అందజేత
- చంద్రబాబు ఏ విషయాన్నీ తేల్చిచెప్పరని విమర్శ
ప్రబోధానంద బలవంతుడు కాబట్టే తనపై దాడి చేశారని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఏ సమస్యపై అయినా చంద్రబాబు తొందరగా తేల్చి చెప్పరని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్య ఉందా? లేదా? అన్న విషయాన్ని హోంమంత్రి చినరాజప్పనే అడగాలని మీడియాకు సూచించారు. తాను చెప్పాల్సిన విషయాలు చంద్రబాబుకు చెప్పేశానని దివాకర్ రెడ్డి అన్నారు.