ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని ధీమాగా... పోలీసుల ముందు మారుతీరావు దర్జా!
- ప్రణయ్ హత్యకు ప్రధాన కుట్రదారు మారుతీరావు
- మీడియా ముందుకు వచ్చిన నిందితులు
- ధీమాగా ఉన్నట్టు కనిపించిన ఏ-1 ముద్దాయి
కేసును విచారిస్తున్న సమయంలోనూ అతను అదే విధమైన హావభావాలతో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. తన లక్ష్యం నెరవేరిందన్న భావన అతని ముఖంలో అనుక్షణం కనిపిస్తోందని, పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించలేదని తెలిపారు. కాగా, ప్రణయ్ హత్యకు కుట్ర చేసిన మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్ లు ఈ నాలుగు రోజుల్లో పక్కపక్కనే ఉన్నా, ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదని, ఇది తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం.