చిరంజీవితో రెండు సినిమాలు చేశాను.. ఆయనకు డబ్బులు కూడా ఇవ్వలేదు!: తమ్మారెడ్డి భరద్వాజ

  • 40 ఏళ్ల క్రితం చిరంజీవితో 'మొగుడు కావాలి' సినిమా తీశా
  • మనం సినిమా చేయాలని అడగ్గానే చిరంజీవి ఒప్పుకున్నారు
  • నేను దర్శకుడిగా మారినప్పుడు పిలవకుండానే వచ్చి, సక్సెస్ పార్టీ ఇచ్చారు
తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, విజయ్ మోర్వనేనిలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ప్యార్ ప్రేమ కాదల్'. తమిళనాట ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని వీరు తెలుగులో డబ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. సినీ పరిశ్రమకు యువరక్తం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, 40 ఏళ్ల క్రితం చిరంజీవితో 'మొగుడు కావాలి' అనే సినిమా తీశానని చెప్పారు. మా నాన్నగారిపై కోపంతో మనం సినిమా చేయాలని చిరంజీవిని అడిగానని... ఆ సినిమా కథ ఏమిటి? దర్శకుడు ఎవరు? అనే వివరాలు కూడా అడక్కుండానే నటించేందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. చిరంజీవితో తనకు ఉన్న అనుబంధం వేరని... ఆయనతో రెండు సినిమాలు చేశానని, వాటికి డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఆ తర్వాత సినిమాల పరంగా తాము కలుసుకోలేదని.. కొంత కాలం తర్వాత 'అలజడి' సినిమాతో తాను దర్శకుడిగా మారినప్పుడు... పిలవకుండానే వచ్చి చిరంజీవి సక్సెస్ పార్టీ ఇచ్చారని తెలిపారు. 
Go Back to Shorts
Chiranjeevi
tammareddy bharadwaja
tollywood
pyar prema kadal

More Telugu News