అమృత వర్షిణి తల్లిపై ప్రణయ్ తల్లి సంచలన ఆరోపణలు!
- రెండు వారాల ముందు నుంచి ఫోన్స్
- నల్లపూసల గొలుసు చేయించానని నమ్మబలికింది
- వివరాలు అడిగి హత్యకు కుట్ర చేసిన అమృతరావు, అతని భార్య
- ప్రణయ్ తల్లి ప్రేమలత ఆరోపణ
వర్షిణి అంగీకరిస్తే ఆమెను తీసుకువెళ్లచ్చని తాము మారుతీరావుకు స్పష్టంగా చెప్పామని అన్నారు. తన కూతురుకు చీమైనా కుట్టకుండా చూసుకుని తన కొడుకును దారుణాతి దారుణంగా మారుతీరావు చంపించాడని ప్రణయ్ తండ్రి బాలస్వామి చెప్పారు. ప్రణయ్, అమృత హైస్కూల్ వయసులోనే ప్రేమించుకున్నారని, తనకు విషయం తెలిసి ప్రణయ్ ని పలుమార్లు కొట్టానని చెప్పిన ఆయన, వారిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చి కాళ్లపై పడి, వేడుకున్నారని కన్నీటితో గుర్తు చేసుకున్నారు.