నేడు మీడియా ముందుకు ప్రణయ్ హత్యకేసు నిందితులు
- ఈ నెల 14న ప్రణయ్ హత్య
- తర్వాతి రోజే నిందితుల అరెస్ట్
- నేటి మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ముందుకు
ఈ నెల 14న ప్రణయ్ హత్య జరిగింది. భార్యను ఆసుపత్రిలో చూపించుకుని బయటకు వస్తుండగా, అక్కడే మాటు వేసిన నిందితుడు వెనక నుంచి వచ్చి ప్రణయ్‌ను కత్తితో నరికాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన అమృత తండ్రి మారుతీరావును, ఆయన సోదరుడిని పోలీసులు ఆ తర్వాతి రోజు అదుపులోకి తీసుకున్నారు. తన కుమార్తెపై ప్రేమతోనే ప్రణయ్‌ను చంపించానని మారుతీరావు చెప్పడం గమనార్హం.