టీమిండియా క్రికెటర్లకు వార్నింగ్ ఇచ్చిన చీఫ్ సెలెక్టర్!
- వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేని వారిపై వేటు తప్పదు
- రిషబ్ పంత్ బ్యాటింగ్ సంతృప్తిని కలిగించింది
- వెస్టిండీస్ టూర్ లో కొందరు ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పిస్తాం
ఇంగ్లండ్ తో జరిగిన ఆఖరి టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్ తనకు సంతృప్తిని కలిగించిందని తెలిపాడు. రిషబ్ బ్యాటింగ్ పై తనకు ఎప్పుడూ, ఎలాంటి అనుమానం లేదని... అయితే, అతని కీపింగ్ నైపుణ్యాలు మరింత మెరుగు పడాల్సి ఉందని చెప్పాడు.
ఆసియా కప్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇచ్చినట్టే.... మరి కొందరు ఆటగాళ్లకు కూడా రెస్ట్ కల్పిస్తామని ప్రసాద్ తెలిపాడు. వెస్టిండీస్ టూర్ లో కొందరు ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పిస్తామని చెప్పాడు. దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న మయాంక్ అగర్వాల్ కు త్వరలోనే అవకాశం వస్తుందని తెలిపాడు.